హైదరాబాద్: 28°C
తెలంగాణ

"వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం"

WGL: వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బల్దియా కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. GWMC పరిధిలోని 19 ప్రధాన చెరువుల్లో ఏర్పాట్లు చేపట్టామని, చిన్న చెరువుల వద్దా సౌకర్యాలు కల్పించామన్నారు. 30 క్రేన్లు, 145 మంది గజ ఈతగాళ్లు, 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రహదారుల మరమ్మతులు, గుర్రపు డెక్క తొలగింపు పూర్తయిందని వెల్లడించారు.