హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకుడి మండపం వద్ద కుంకుమ పూజా

ASF: దహేగాం మండలంలోని ఏటిగుడేం గ్రామంలోని వినాయకుడి మండపం వద్ద మహిళల ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మహిళల భక్తి, పూజా కార్యక్రమాలతో ఆ వాడలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.