హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏజెన్సీ యువతకు 75% రిజర్వేషన్ ఇవ్వాలి'

KMM: గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు ఉద్యోగ నియామకాల్లో 75% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు.