హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందు చల్లిన గడ్డి తిని ఏడు గొర్రెల మృతి

JGL: కోరుట్ల మండలం సర్పరాజ్‌పూర్ గ్రామానికి చెందిన పుల్ల మల్లయ్య గొర్రెలు మంగళవారం మేతకు వెళ్లి మృతి చెందాయి. మందలోని ఏడు గొర్రెలు మృతి చెందడంతో పశువైద్య అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు మందు చల్లిన గడ్డి తినడం వల్లే గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన మల్లయ్యను ప్రభుత్వం ఆదుకోవాలనికోరారు.