హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలి'

NRML: ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని CM రేవంత్ రెడ్డిని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ కోరారు. అటవీ శాఖ నిబంధనలు, అధికారుల అభ్యంతరాల కారణంగా ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, మౌలిక వసతుల కల్పనలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. అటవీ శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి, ప్రజలకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.