HYD: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూలోని ఐదు ఖడ్గమృగాలకు పండ్లు, కూరగాయలతో తయారు చేసిన 7 కేజీల ప్రత్యేక కేక్‌ను తినిపించారు. 2012లో పట్నా జూ నుంచి తీసుకొచ్చిన జత ద్వారా ఇప్పటివరకు నాలుగు పిల్లలు జన్మించాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థుల కోసం ప్రత్యేక టాక్‌షో నిర్వహించారు.
తెలంగాణ
'జూ'లో ఘనంగా రైనో డే వేడుకలు


