E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంగం అమ్ములు కుటుంబానికి చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన తాటాకు పందిరికి మంటలు అంటుకుని, క్రమంగా ఇంటికి వ్యాపించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బూరుగుపూడిలో అగ్నిప్రమాదం


