హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని దగ్గర గత తొమ్మిది రోజుల నుంచి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను హనుమాన్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసి, భజనలతో అలరిస్తున్నారు. దీంతో ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది.