హైదరాబాద్: 28°C
తెలంగాణ

తక్కువ ధరకు కొని.. అధిక ధరకు విక్రయం

MDCL: రామంతపూర్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్ ఎదురుగా బిల్లులు లేకుండా నిల్వ చేసిన సుమారు 15 టన్నుల ఇసుకను ఉప్పల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మహమ్మద్ బురాన్ అలియాస్ జిల్లు (44)ను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు నిల్వ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.