హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 2190.63 కేజీల గంజాయి సీజ్

BDK: జిల్లాలో ఇప్పటివరకు 2190.63 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని డీఆర్వో పద్మావతి తెలిపారు. గంజాయి విలువ రూ.11,20,81,500 ఉంటుందన్నారు. మొత్తం 219 మందిని అరెస్టు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 65 మందిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. గంజాయిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.