హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐస్ వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ

MBNR: జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ యూత్ ఏర్పాటు చేసిన ఐస్ గణపతిని మంగళవారం సాయంత్రం ఎస్పీ జానకి దర్శించుకున్నారు. పర్యావరణహితంగా ఐస్ గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకిని మండప నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.