హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు ఇళ్లు మంజూరు చేయాలి'

BDK: బూర్గంపాడు మండలంలో మంగళవారం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బరగడ దేవదానం ఎంపీడీవో జమలారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పగడాల కరుణాకర్‌రెడ్డి, సురగంటి ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రవి, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.