హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీ ఓటరు జాబితా ప్రచురణ

కోనసీమ: రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్న 32 వార్డులకు సంబంధించి 32 వార్డుల ఫోటో ఎలక్టోరల్ ఓటరు జాబితా ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 1, 2026 నాటికి అర్హత కలిగిన ఓటర్లతో ఈ జాబితాను రూపొందించామన్నారు. ఈ జాబితాను ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలలో ఉంచామన్నారు.