NGKL: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి నీటి సరఫరాపై ఈరోజు అధికారులతో సమీక్షించారు. తక్కువ నీటి సరఫరాకు కారణాలను లైన్‌మెన్లు, వాటర్‌మెన్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్లు, పంపింగ్ సామర్థ్యం, సాంకేతిక సమస్యలపై చర్చించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
మిషన్ భగీరథ నీటిపై ఎమ్మెల్యే సమీక్ష


