SRPT: మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాలువలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఈరోజు పోలీసులు తెలిపారు. నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. బరకత్ గూడెం సాగర్ కాలువకు వెళ్లే దారిని మూసివేసి, నిమజ్జనానికి అనుమతి లేదని సూచిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
సాగర్ కాలువలో నిమజ్జనానికి అనుమతి లేదు


