హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చందవరం బౌద్ధ స్తూపాన్ని పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం జిల్లా కలెక్టర్ పీ. రాజాబాబు మంగళవారం దొనకొండ మండలం చందవరం బౌద్ధ స్తూపాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులను అడిగి స్తూపం చారిత్రక ప్రాధాన్యత, పర్యాటక అభివృద్ధి, సందర్శకులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.