హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సట్టా జూదం ఆడుతున్న మహిళ అరెస్ట్

వరంగల్ ప్రతాప్‌నగర్‌లో సట్టా జూదం నిర్వహిస్తున్న ఓ మహిళను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి రూ.5,250 నగదు, సట్టా గేమ్‌ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ప్రతాప్‌నగర్‌ క్రిస్టియన్‌ కాలనీకి చెందిన గడ్డల శ్రీలత (45)గా తెలిపారు. కేసు నమోదు నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు CI శ్రీధర్ తెలిపారు.