VKB: దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటనపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై జాదవ్ తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే తొలి దశలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరువర్గాల వారు రాజీ లేఖ ఇవ్వడంతో వెంటనే కేసు నమోదు చేయలేదని ఎస్సై వివరించారు. ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
తెలంగాణ
దోమలో బాలికపై అఘాయిత్యం కలకలం


