MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వెండి తొడుగులు చోరీకి గురైనట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. శ్రీ బంగారమ్మ ఆలయం వద్ద గల వెంకటేశ్వర స్వామి వెండి కిరీటం, వెండి పాదాలు, వెండి చేతులు చోరీకి గురైనట్లు పూజారి వేణుగోపాల్ మంగళవారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
వెంకటేశ్వర స్వామి తొడుగులు చోరీ


