హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళలకు నైపుణ్య శిక్షణతో ఉపాధి

AKP: జిల్లా యువత, మహిళల ఉపాధి కోసం రెన్యూ ప్రైవేట్ లిమిటెడ్‌తో మంగళవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అచ్యుతాపురం వన్‌స్టాప్ సెంటర్‌లో అక్టోబర్ నుంచి 300మందికి ఉచిత సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించడమే దీని లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రెన్యూ సీఈవో సంజయ్ వర్గీస్ పాల్గొన్నారు.