హైదరాబాద్: 28°C
తెలంగాణ

అఖిలకు గ్రామస్తుల సన్మానం

SRD: సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తాండకు చెందిన అఖిల ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటింది. ఈమేరకు సర్పంచ్ రుక్మిణి ఫుల్ సింగ్, తండా పెద్దలు మంగళవారం అఖిలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ తండాకు చెందిన విద్యార్థిని ప్రభుత్వ వైద్య సీటు సాధించడం ఎంతో గర్వకారణమని, గ్రామానికి ఎనలేని గుర్తింపు తెచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.