హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం సేవించి వాహనాలు నడపవద్దు'

ప్రకాశం: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పామూరు ఎస్సై అనూక్ సూచించారు. మంగళవారం పామూరు పట్టణంలోని హైవేపై వాహనదారులకు రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని సూచించారు.