హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా చర్యలు

MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.