హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శిలార్ పల్లి చెరువుల గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను చేపట్టారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్ మంగళవారం నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.