హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుకు మహిళ మృతి

BHNG: అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన సింగరి పద్మ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.