హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేబిస్ నివారణపై అవగాహన కార్యక్రమాలు: DMHO

KMM: రేబిస్ నివారణపై జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఈనెల 28 వరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంగళవారం DMHO డాక్టర్ రామారావు తెలిపారు. కుక్కలు కరిచిన చోట వెంటనే సబ్బు నీటితో కడిగి ఆసుపత్రిలో టీకా వేయించుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేయించడంతో పాటు పిల్లలను వీధి కుక్కల నుంచి కాపాడుకోవాలని సూచించారు.