హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాసరచన పోటీల్లో ఐడీపీఎస్ విద్యార్థుల ప్రతిభ

కడపలో నిర్వహించిన టాటా బిల్డింగ్ ఇండియా వ్యాసరచన పోటీల్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ మల్లంగి వివేకానందరెడ్డి, ప్రిన్సిపల్ ఎం. హరికృష్ణ, ఇన్‌చార్జ్ సంధ్య పాల్గొన్నారు.