హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్ల సభతో కేటీఆర్ పతనం మొదలు: ఆది

SRCL: ఈ నెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి సభ సిరిసిల్లలో ఉందంటే కేటీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. పదేళ్లలో రాజన్న ఆలయానికి నయాపైసా నిధులు ఇవ్వని కేటీఆర్, కేసీఆర్ రాజన్నను దర్శించుకుని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.