హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాలను సందర్శించిన బీజేపీ నేతలు

MBNR: జడ్చర్ల మున్సిపల్ పరిధిలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను బీజేపీ పట్టణ నాయకులు సందర్శించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.