SRD: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ అని జిల్లా ఎలిమెంటరీ విద్యా కార్యదర్శి డి.లింబాజీ అన్నారు. తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లుల పేరు మీద మొక్కలు నాటారు. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో మూడు రోజుల్లో 40 వేల మొక్కలు నాటే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ
పర్యావరణ రక్షణే మానవ మనుగడకు ఆధారం: డి.లింబాజీ


