హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు

కరీంనగర్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. జగిత్యాల వైపు నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను వెలిచాల క్రాస్ రోడ్డు, చింతకుంట మీదుగానూ.. హుజూరాబాద్ నుంచి వచ్చే వాహనాలను దర్శేడు వైపు మళ్లించనున్నారు. అలాగే రేపు, ఎల్లుండి నగరంలోకి గ్రానైట్ లారీలు, భారీ వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిరాకరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.