హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

WNP: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. వనపర్తి నుంచి కొల్లాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.