హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాస్యంపై దాడి సరైనది కాదు: ఎర్రబెల్లి

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌పై పోలీసుల దాడి సరైనది కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎర్రబెల్లి సూచించారు.