హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్ వ్యాధుల నివారణకు డ్రైడే కార్యక్రమం

WNP: మున్సిపాలిటీ జోన్‌-3 పరిధిలోని 24, 25వ వార్డుల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు మురికి కాలువలు, రోడ్లు, పిచ్చి మొక్కలను శుభ్రం చేశారు. నీటి నిల్వ ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందు పిచికారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.