హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణాలతో 6 అడుగుల గణపతి

SDPT: 1988 నాటి అరుదైన పది పైసల నాణాలతో గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు 6 అడుగుల గణపతి చిత్రాన్ని రూపొందించారు. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడైన రామరాజు వినూత్న కళారూపంతో గణపయ్యను ఆవిష్కరించారు. భగవంతుడు ప్రసాదించిన కళతో ఇలాంటి ఎన్నో చిత్రాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.