హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు: సీపీ

KNR: గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సీపీ గౌష్‌ ఆలం, కలెక్టర్‌ చిత్రా మిశ్రా పరిశీలించారు. చింతకుంట కాలువ, కొత్తపల్లి చెరువులలో క్రేన్లు, లైటింగ్, బారికేడింగ్‌లను చూశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు.