హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరికలు

MBNR: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ఎస్‌కు చెందిన మహ్మద్ నిహాజ్, నవాజ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.