ASF: మాత శిశు మరణాలు సంభవించకుండా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కే.హరిత సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గత ఏడాది జరిగిన 5 మాత మరణాలపై సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు ప్రతినెల వైద్య పరీక్షలు, స్కానింగ్, పోషకాహారం అందించాలని, రక్తహీనతను గుర్తించి చికిత్స చేయాలని తెలిపారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలన్నారు.
తెలంగాణ
మాత శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు


