MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ అంజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనాల సందర్భంగా 65 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 రోజుల్లో నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నిమజ్జనాల్లో డీజేలకు 'నో': సీఐ


