హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీఓ

MNCL: భీమిని మండలంలో ఏసీబీ అధికారుల దాడి స్థానికంగా సంచలనం సృష్టించింది. పెద్దంపేటకి చెందిన రైతు ఫకీర్‌ను సాదాబైనామా పట్టా మార్పిడికై జీపీవో దుర్గాప్రసాద్ లంచం కోరారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి పథకం ప్రకారంగా మంగళవారం రూ. 80,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామన్నారు.