హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లు అందించాలి'

BHNG: పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం వెంటనే పూర్తి స్థాయి రక్షణ కిట్లు అందించాలని సీపీఐ(ఎం) ఆలేరు పట్టణ కార్యదర్శి ఎం.ఏ.ఇక్బాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆలేరు పట్టణంలో సోమవారం బ్లీచింగ్ సున్నం మిక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి పలువురు పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు.