హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన డీఐజీ, SP

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని గణపతి నిమజ్జన ప్రదేశాన్ని కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా, ఎస్పీ నితికా పంత్ మంగళవారం పరిశీలించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.