హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైన్ షాపుల లైసెన్స్ రెన్యువల్ గడువు పొడిగింపు

నెల్లూరు జిల్లాలోని 193 మద్యం దుకాణాలకు గాను సోమవారం సాయంత్రానికి 143 దుకాణాల లైసెన్సులు పునరుద్ధరించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రెన్యువల్ గడువు సోమవారంతో ముగియగా, బుధవారం వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొడిగించిన గడువులో మిగిలిన దుకాణాల లైసెన్సులు రెన్యువల్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.