SRD: నారాయణఖేడ్, మానూర్, నాగల్గిద్ద మండలాలకు సంబంధించిన వినాయక నిమజ్జనాలు జరగనున్న కమలాపురం చెరువును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వినాయక నిమజ్జనాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం: ఎస్పీ


