హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణుక ఎల్లమ్మ తల్లి దివ్య అలంకరణ

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం సందర్భంగా..అమ్మవారిని వినాయక స్వామి తల్లి అయిన శ్రీ పార్వతి దేవిగా, సర్వమంగళ దేవిగా దివ్యంగా అలంకరించారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేసి, ప్రత్యేక ఆశీస్సులు అందించారు.