హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుకు రైతు మృతి

PDPL: ఓదెల మండలం కొలనూరులో పిడుగుపాటుకు గురై రైతు జంగా సుధాకర్‌రెడ్డి(65) మృతి చెందాడు. మంగళవారం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన ఆయనపై మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఆయన సమీపంలో పిడుగు పడింది. దీంతో సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.