హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్యాల పీహెచ్‌సీలో ప్రతికూల వార్తపై విచారణ

JGL: మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి పత్రికలో ప్రచురితమైన ప్రతికూల వార్తపై జగిత్యాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం విచారణ చేపట్టారు. వార్తలో ప్రస్తావించిన ఆరోపణలు, అంశాలపై పీహెచ్‌సీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించేందుకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.