KDP: కడపను కరువు జిల్లాగా ప్రకటించాలని చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లి రైతు సేవా కేంద్రం ఎదుట మంగళవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరువు అంచనా వేసి రుణమాఫీ, రబీలో 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'కడపను కరువు జిల్లాగా ప్రకటించాలి'


