హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి'

అన్నమయ్య: గ్రామ కంఠం నుండి పొలాలలోకి వెళ్లే దారిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి గ్రామస్తులు చిట్వేలి ఎంఆర్ఓ నరసింహారావును కోరారు. మైలపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామ కంఠం నుండి పొలాలకు రాకపోకలు సాగించే దారిని ఇటీవల కొందరు వ్యక్తులు కబ్జా చేసి కంచె నిర్మించారు. దీనివల్ల రైతులు, గ్రామస్తులకు రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని వాపోయారు.