హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైప్‌లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీవి

PLD: వినుకొండలో రూ.240 కోట్ల సమగ్ర తాగునీటి పథకంలో భాగంగా తిమ్మాయపాలెం రోడ్డులో జరుగుతున్న పైప్‌లైన్ పనులను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పరిశీలించారు. నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికీ మంచినీరు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత నాగ శ్రీను రాయల్, అధికారులు పాల్గొన్నారు.